మది రెక్కలు విప్పుకొని వెళుతుంటే ..
రంగుల కలలు దరిచేరవని నిరాశ పడింది...
వెచ్చబడిన మేను...
కొండ అంచున విహరిస్తున్న నేను
తటిళ్ళున చీకటి గుహలో దాక్కున్నాను
నులివెచ్చని గాలేదో నను సోకినట్టు..
ఎన్నెన్ని ప్రయాణాలు
చేశాను ఈ దారి వెంట...
అయినా
నేను దారి తప్పుతూనే ఉంటాను
మరో కొత్త దారిలో నిను కనిపెడదామని...
నిజంగానే
జ్వరం వచ్చింది
వెచ్చమైన జ్వరం వచ్చింది
అయితేనేం
అలసిన మేనును వెంటేసుకొని
రెక్కల గుర్రంలా మది పరిగెడుతూనే ఉంది...
ఓయ్
ఈ వేళ
ఇలా గడిచిపోని...
నీవు రాని రోజుగా...